TS News: ఇంటర్‌ బోర్డు ముట్టడికి ఏబీవీపీ యత్నం.. ఉద్రిక్తత

గుర్తింపు లేని ఇంటర్‌ కళాశాలలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. తెలంగాణ ఇంటర్‌ బోర్డు ముట్టడికి ఏబీవీపీ యత్నించింది. అధిక ఫీజులు వసూలు చేసే కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం తొత్తుగా మారిందని ఆరోపించింది. తొమ్మిదేళ్లలో విద్యా వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేశారని ఏబీవీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీవీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు.. వారిని పీఎస్‌కు తరలించారు. 

Published : 07 Jun 2023 14:52 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు