Chandrababu: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ కస్టడీకి చంద్రబాబు

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబును (Chandrababu) పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. రెండ్రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబును అయిదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరగా.. న్యాయమూర్తి రెండ్రోజుల విచారణకు అనుమతించారు. రాజమహేంద్రవరం జైలులోనే చంద్రబాబును విచారణ చేయాలని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated : 22 Sep 2023 20:27 IST
Tags :

మరిన్ని