Andhra news: వైకాపా ఎమ్మెల్సీ బర్త్‌డే వేడుకల్లో చిందేసిన ఎస్‌ఐపై వేటు

టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎస్‌ఐ సీహెచ్‌ హరికృష్ణపై వేటు పడింది. శుక్రవారం రాత్రి టెక్కలిలోని రోటరీ నగర్ ప్రాంతంలో వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న ఎస్సై హరికృష్ణ..స్టేజ్ పైకెక్కి డ్యాన్సర్లతో కలిసి స్టెప్పులేశారు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జరుగుతున్న అశ్లీల నృత్యాలను అడ్డుకోవాల్సిన ఎస్సై.. వారితో జత కలిసి వేదికపై చిందులు వేయడం స్థానికుల్ని విస్మయానికి గురిచేసింది. ఎస్‌ఐ చిందేసి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఎస్‌ఐ హరికృష్ణను వీఆర్‌కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Updated : 05 Nov 2022 22:26 IST

Tags :

మరిన్ని