Dasara: ‘దసరా’ రిలీజ్‌.. సుదర్శన్ థియేటర్ వద్ద హీరో నాని సందడి..

నాని(Nani) నటించిన ‘దసరా’ (Dasara) చిత్రం నేడు విడుదలైంది. పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ వద్ద నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సందడి చేశారు. అభిమానులు, ప్రేక్షకులతో కలిసి మార్నింగ్ షో చూశారు. థియేటర్‌లో తన నటన, పాటలకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి నాని ఆనందం వ్యక్తం చేశాడు. నానిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో సుదర్శన్ థియేటర్ వద్ద పండగ వాతావరణం నెలకొంది.

Published : 30 Mar 2023 11:16 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు