Prabhas: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో ప్రభాస్‌

తిరుమల శ్రీవారిని సినీ నటుడు ప్రభాస్ (Prabhas) దర్శించుకున్నారు. తిరుపతిలో మంగళవారం సాయంత్రం జరగనున్న ‘ఆదిపురుష్‌’ (Adipurush) చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా నిన్న రాత్రి ప్రభాస్ తిరుమలకు చేరుకున్నారు. ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను ఆయనకు అందజేశారు. ప్రభాస్‌ను చూసేందుకు ఆలయ ప్రాంగణంలోకి భారీగా అభిమానులు, భక్తులు చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం ఏర్పడింది.

Published : 06 Jun 2023 09:29 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు