సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్‌.. వివాహ విందుకు ఆహ్వానం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR)ను యువ కథానాయకుడు శర్వానంద్ (Sharwanand) మర్యాదపూర్వకంగా కలిశారు. రేపు జరిగే తన వివాహ విందుకు రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు ప్రగతిభవన్‌కు వెళ్లిన శర్వానంద్.. ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా శర్వానంద్‌తో కాసేపు సీఎం ముచ్చటించి పెళ్లి కబుర్లు తెలుసుకున్నారు. ఇటీవల జయపురలోని లీలా ప్యాలెస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రక్షితను శర్వానంద్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Published : 08 Jun 2023 20:17 IST

మరిన్ని