నిలకడగానే తారకరత్న ఆరోగ్యం.. బెంగళూరుకు తీసుకెళ్తాం: బాలకృష్ణ

లోకేశ్‌ పాదయాత్రలో అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్న (Taraka ratna) ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) తెలిపారు. ‘ప్రస్తుతం తారకరత్న బీపీ 120/80 చూపిస్తుంది. గుండెలో ఎడమవైపు వాల్వు 90 శాతం బ్లాక్‌ అయింది. బెంగళూరు తీసుకెళ్తే బాగుంటుందని వైద్యులు సూచించారు. బెంగళూరు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని బాలకృష్ణ వెల్లడించారు.

Updated : 27 Jan 2023 17:17 IST

మరిన్ని