Ajith: ‘తెగింపు’ ట్రైలర్‌ వచ్చేసింది.. ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లో అజిత్‌

హైదరాబాద్‌: ‘రూల్‌ నెం.1.. హీరోలా నటించవద్దు. అందుకు నేను ఉన్నానుగా..’ అంటున్నారు అజిత్‌. ఆయన కథానాయకుడిగా హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ యాక్షన్‌ చిత్రం ‘తునివు’. తెలుగులో ‘తెగింపు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నూతన సంవత్సర కానుకగా ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. దొంగతనం చేయడానికి అజిత్‌, మరికొందరు బ్యాంకులోకి ప్రవేశిస్తారు. అక్కడున్న వారిని బందీలుగా చేసుకుంటారు. ఇంతకీ అజిత్‌ ఎందుకు బ్యాంకు దోపిడి చేయాల్సి వచ్చింది? ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలేంటి? ఎందుకు ఈ ‘తెగింపు’ చేయాల్సి వచ్చింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 02 Jan 2023 20:08 IST
Tags :

మరిన్ని