Aler: మహిళపై ఎమ్మెల్యే గొంగిడి సునీత తీవ్ర అసహనం.. కారణమిదే!

తనకు ‘షాదీ ముబారక్‌ (Shaadi Mubarak)’ డబ్బులు రాలేదని ఓ మహిళ అడగడంతో.. ప్రభుత్వ విప్‌, ఆలేరు భారాస ఎమ్మెల్యే గొంగిడి సునీత (Gongidi Sunitha) తీవ్ర అసహనానికి గురయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్‌ (ఎం)లో డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ల గృహప్రవేశం కోసం.. లబ్ధిదారులు నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ వేదికపైకి వచ్చిన ఓ మహిళ ‘నాకు డబుల్​బెడ్​రూం ఇల్లు రావడం ఆనందంగా ఉంది. కానీ షాదీ ముబారకే రాలేదు’ అని ఎమ్మెల్యేకు శాలువా కప్పే ప్రయత్నం చేశారు. దీంతో అసహనానికి గురైన సునీత.. ఆమెను తోసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Published : 13 Apr 2023 16:19 IST
Tags :

మరిన్ని