Amaravati: రాజధాని ప్లాట్లు.. రుణాలు కూడా దక్కక పాట్లు..!

ఏడాదికి మూడు పంటలు పండే భూములను అక్కడి రైతులు రాజధాని కోసం ఇచ్చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు ఇచ్చిన భూములకు.. ప్రతిఫలంగా 25% భూమి తిరిగి ఇచ్చింది. రిటర్నబుల్‌ ప్లాట్లకు సంబంధించి పట్టాకాగితాలూ అందించింది. కానీ, వైసీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని పనులు ఆపేయటంతో ప్లాట్లకు విలువ లేకుండా పోయింది. అమ్ముదామంటే కొనేవారు లేరు. ఆస్తి కాగితాలు కుదవ పెట్టి అప్పివ్వమంటే బ్యాంకులు అంగీకరించటం లేదు. దీంతో అమరావతి రైతులకు వచ్చిన ప్లాట్ల దస్త్రాలు చిత్తు కాగితాలతో సమానమయ్యాయి. దీంతో వారి ఆర్థిక అవసరాలకు బయట అప్పు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. 

Updated : 20 May 2023 14:48 IST

Tags :

మరిన్ని