Amigos: కల్యాణ్‌ రామ్‌ ‘అమిగోస్‌’లో.. బాలకృష్ణ సూపర్‌ హిట్‌ సాంగ్‌ రీమిక్స్‌

‘బింబిసార’ (Bimbisara) తర్వాత కల్యాణ్‌ రామ్‌ (Kalyan Ram) చేసిన కొత్త చిత్రం ‘అమిగోస్‌’ (Amigos). రాజేంద్ర రెడ్డి దర్శకుడు. ఆషికా రంగనాథ్‌ కథానాయిక. ఫిబ్రవరి 10న విడుదల కానుంది. బాలకృష్ణ (Balakrishna) నటించిన ‘ధర్మక్షేత్రం’లోని ‘‘ఎన్నో రాత్రులొస్తాయి గాని’’ పాటను ఈ చిత్రంలో రీమిక్స్‌ చేశారు. ఈ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా చిత్ర బృందం వదిలింది. కాగా, ‘‘ఎన్నో రాత్రులొస్తాయి’’ పాటను ఇళయరాజా స్వరపరచగా.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సంయుక్తంగా ఆలపించారు. ఇప్పుడీ గీతాన్ని జిబ్రాన్‌ సరికొత్తగా రీమిక్స్‌ చేశారు. 

Updated : 27 Jan 2023 17:46 IST
Tags :

మరిన్ని