Amritpal Singh: లొంగిపోనున్న అమృత్ పాల్ సింగ్‌..?

గత పది రోజులుగా పోలీసుల కంట పడకుండా తప్పించుకుని తిరుగుతున్న ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ (Amritpal Singh) లొంగిపోయే అవకాశం ఉన్నట్లుు తెలుస్తోంది. లొంగిపోయే ముందు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వాలని అమృత్ పాల్ యోచిస్తున్నాడని పంజాబ్  పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే, ఇంటర్వ్యూ ఇస్తే ఎక్కడ దొరికిపోతానో అనే భయంతో అమృత్ పాల్ తన మనసు మార్చుకున్నాడని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Published : 29 Mar 2023 18:53 IST
Tags :

మరిన్ని