Crime: మాజీ సైనికుడి ప్రాణం తీసిన రాష్‌ డ్రైవింగ్‌

బెంగళూరులో తప్పతాగి కారును నడిపిన ఓ డ్రైవర్ మాజీ సైనికుడిని బలిగొన్నాడు. కొడిగెహల్లిలో జరిగిన ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. రవిశంకర్ అనే ఓ మాజీ సైనికుడు ప్రస్తుతం ఓ ప్రైవేటు సంస్థలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇంటికి వెళ్తుండగా రహదారి పక్కన ఓ హోటల్ ముందు ఆగి ఆహారాన్ని పార్సిల్ చేసుకునే సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు అతడి బైకును ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకు చాలా దూరంలో ఎగిరిపడగా రవిశంకర్  అక్కడిక్కడే మృతిచెందారు.

Published : 13 Oct 2022 13:02 IST

Tags :

మరిన్ని