కోడిగుడ్ల దాడిపై పోలీసుల వ్యాఖ్యలు పచ్చి బూటకాలు: ఆనం వెంకటరమణారెడ్డి

లోకేశ్‌పై జరిగిన కోడిగుడ్ల దాడిపై.. పోలీసుల వ్యాఖ్యలు పచ్చి బూటకాలని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. లోకేశ్ తమతో సెల్ఫీ దిగలేదన్న అక్కసుతోనే కోడిగుడ్లు విసిరారని చెప్పడం పిచ్చికథేనన్నారు. ఘటన జరిగిన రోజే నిందితుల్ని ప్రజలకు మీడియా చూపిస్తే.. వారిని పట్టుకోవడానికి పోలీసులకు వారం పట్టిందని ఎద్దేవా చేశారు. మరీ ఇంత ఏకపక్షంగా పోలీసులు వ్యవహరించడం నిజంగా సిగ్గు చేటన్నారు.

Published : 08 Jun 2023 22:10 IST

మరిన్ని