TDP: మీకే ఓటేస్తా!: తెదేపా మాజీ ఎమ్మెల్యే కాళ్లుపట్టుకొని కృతజ్ఞతలు తెలిపిన మహిళ

తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇంటిని చూపుతూ.. ప్యారీ అనే మహిళ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కాళ్లుపట్టుకొని కృతజ్ఞతలు తెలిపింది. ప్రభాకర్ చౌదరి అనంతపురంలోని నాల్గో రోడ్డులో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సాయంత్రం రంగస్వామినగర్ శివారు ప్రాంతంలోకి వెళ్లిన ప్రభాకర్ చౌదరికి ప్యారీ అనే మహిళ.. వారి దయవల్లనే ఇల్లు వచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది. వారికి తప్ప వేరే ఎవరికీ ఓటు వేయనంటూ ప్రభాకర్ చౌదరికి మహిళ తెలిపింది.  

Published : 28 Dec 2022 13:31 IST

Tags :

మరిన్ని