Anaparti: మీ నిర్ణయాల వల్లే మాపై వ్యతిరేకత.. అధికారులపై అనపర్తి ఎమ్మెల్యే ఫైర్‌

అధికారుల తప్పుడు నిర్ణయాల వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి మండిపడ్డారు. నియోజకవర్గ రైతులతో సమావేశమైన ఆయన.. పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్‌తో కలిసి క్షేత్రస్థాయిలో సమస్యలపై చర్చించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఎమ్మెల్యే మండిపడ్డారు. వాలంటీర్లకు పనులు అప్పగించడం ఏంటని అధికారులను నిలదీశారు. రెండ్రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే ధర్నా చేస్తానని హెచ్చరించారు.

Updated : 09 Nov 2022 13:16 IST

Tags :

మరిన్ని