Andhra News: తిరుమల పార్వేటి మండపం దగ్గర ఏనుగుల సంచారం

తిరుమల పార్వేటి మండపం దగ్గర ఏనుగుల సంచారం కలకలం రేపింది. కొన్ని రోజులుగా పాపవినాశనం రోడ్డు వద్ద సంచరిస్తున్న గజరాజులు ఉదయం పార్వేటి మండపం దగ్గర తిరిగాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురి చేశాయి. ఏనుగుల గుంపును దారి మళ్లించేందుకు అటవీ శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. పాపవినాశనం, ఆకాశగంగ, జాపాలి తీర్థాలకు వెళ్లే వాహనాలను తితిదే విజిలెన్స్, అటవీ శాఖ సిబ్బంది గంట సమయం పాటు అనుమతించలేదు.

Published : 23 May 2022 12:50 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని