సిట్‌, ఈడీ విచారణకు ముందు డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు నవదీప్ అంగీకరించారు: ఎస్పీ సునీతారెడ్డి

సినీనటుడు నవదీప్‌ (Navadeep) ప్రస్తుతం ఎలాంటి డ్రగ్స్‌ వాడటంలేదని సమాధానం ఇచ్చారని యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సునీతారెడ్డి వెల్లడించారు. మాదాపూర్ డ్రగ్స్‌ కేసు (Drugs Cas)లో నవదీప్‌ను విచారించామని ఆమె తెలిపారు. తాము డిగిన వివరాలకు నవదీప్‌ సమాధానాలు ఇచ్చినట్టు చెప్పారు. మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో ఉన్న 81లింక్‌లను గుర్తించామని.. అందులో 41లింకులపై ఉన్న వివరాలను నవదీప్ తెలిపారని సునీతారెడ్డి పేర్కొన్నారు. సిట్‌, ఈడీ విచారణకు ముందు డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు నవదీప్ అంగీకరించారని.. ఇప్పుడు మాత్రం డ్రగ్స్ వాడటంలేదని చెప్పాడని ఎస్పీ తెలిపారు. నవదీప్ ఫోన్‌లో ఉన్న డేటా మొత్తం డిలీట్‌ చేశారని, ఆ ఫోన్‌ను రీట్రైవ్‌ చేసి మళ్లీ విచారిస్తామని సునీతారెడ్డి తెలిపారు.  

Published : 23 Sep 2023 21:15 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు