Film Federation: ఆందోళన విరమించిన సినీ కార్మికులు

సినీ కార్మికులు ఆందోళన విరమించారు. వేతనాల పెంపుపై నిర్మాతల మండలి నుంచి స్పష్టమైన హామీ రావడంతో ఆందోళన విరమించి రేపటినుంచి సినిమా చిత్రీకరణలకు హాజరుకానున్నట్లు ఫిలిం ఫెడరేషన్ నాయకులు వెల్లడించారు. వేతనాల పెంపుపై రెండ్రోజుల నుంచి ఆందోళన చేసిన సినీ కార్మిక సంఘాలు మంత్రి తలసాని చొరవతో నిర్మాతల మండలితో చర్చలు జరిపారు. ఆ చర్చల్లో సినీకార్మికుల సమస్యలు, వేతనాల పెంపుపై సుమారు 2 గంటలపాటు చర్చించారు. సినీ కార్మికుల వేతనాలపై దిల్ రాజు అధ్యక్షతన సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మాతల మండలి ప్రకటించింది.

Published : 23 Jun 2022 17:29 IST

Tags :

మరిన్ని