YSRCP: గడపగడపలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి నిరసన సెగ..!

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామికి(Narayana Swamy) నిరసన సెగలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చిత్తూరు(Chittoor) జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం పంచాయతీ పరిధిలో ఆయన పర్యటించారు. నాలుగేళ్లుగా డీఎస్సీ నిర్వహించలేదని, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించలేదంటూ విజయమాంబపురానికి చెందిన యువకులు ఉపముఖ్యమంత్రితో వాగ్వాదానికి దిగారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ సమస్యలు పరిష్కరించలేదని మహిళలు ఆయన్ను విమర్శించారు. గ్రామంలో సెల్ టవర్, బస్టాండ్ లేదని, రోడ్లు, మురుగునీటి కాలువలు అధ్వానంగా ఉన్నాయని వాపోయారు. 

Published : 02 Apr 2023 10:54 IST

మరిన్ని