Hyderabad: హైదరాబాద్‌లో తెదేపా నేత ఇంటివద్ద ఏపీ పోలీసుల హల్‌చల్‌

హైదరాబాద్‌ బంజారాహిల్స్ ట్రెండ్‌సెట్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఇంటిని ఏపీ పోలీసులు చుట్టుముట్టారు. విజయ్ ఇంట్లో లేకపోవడంతో పనిమనిషిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారు ఎందుకు వచ్చారో.. అసలు కేసు ఏంటో కూడా చెప్పలేదని విజయ్‌ కుటుంబసభ్యులు వాపోయారు. ఇంట్లో పిల్లలు ఉన్న సమయంలో పోలీసుల పేరుతో హల్‌చల్ చేశారని మండిపడ్డారు. అసలు వచ్చింది పోలీసులా.. కాదా.. అనే విషయమూ తెలియట్లేదని వారు అనుమానం వ్యక్తం చేశారు. 

Published : 01 Oct 2022 16:55 IST

Hyderabad: హైదరాబాద్‌లో తెదేపా నేత ఇంటివద్ద ఏపీ పోలీసుల హల్‌చల్‌

Tags :

మరిన్ని