UPI Payments: సైబర్‌ మోసాలు.. 50 శాతం యూపీఐ చెల్లింపులతోనే!

ఒకప్పుడు కావాల్సినన్ని డబ్బులు ఉంటేనే.. ఎక్కడైనా షాపింగ్ లేదా డిన్నర్‌. మరి, ఇప్పుడు.. టీ  షాప్‌ నుంచి రెస్టారెంట్‌ వరకు మెడికల్‌షాప్‌ నుంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ వరకు.. ఇలా ప్రదేశమేదైనా బిల్లు చెల్లింపు చేసేది మాత్రం యూపీఐ (UPI Payments) ద్వారానే. అంతలా మన నిత్య జీవితంలో డిజిటల్‌ చెల్లింపులు ఓ భాగమైపోయాయి. కానీ అదే యూపీఐతో ఎంతో నష్టం కూడా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. గడిచిన మూడేళ్లలో జరిగిన సైబర్‌ మోసాల్లో (Cyber Fraud)యూపీఐ చెల్లింపుల ద్వారా జరిగిన మోసాలు.. 50శాతం వరకు ఉన్నాయని ప్యూచర్‌ క్రైం రీసెర్చ్‌ ఫౌండేషన్‌ అనే కంపెనీ తాజాగా వెల్లడించింది. మరి, ఇంతలా యూపీఐ ద్వారానే సైబర్‌ మోసాలు పెరగడానికి కారణమేంటి ? ప్రజలు ఈ మోసాల నుంచి బయటపడే మార్గమే లేదా ?

Published : 27 Sep 2023 22:28 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు