Anam: దాడులకు భయపడే ప్రసక్తే లేదు: ఆనం వెంకటరమణారెడ్డి

తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి (Anam VenkataRamana Reddy)పై దుండగులు దాడికి యత్నించడం కలకలం రేపింది. నెల్లూరులోని తన కార్యాలయం నుంచి నివాసానికి వెళ్తుండగా.. కొందరు యువకులు కర్రలతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. వెంకటరమణారెడ్డితోపాటు ఉన్న మరో తెలుగుదేశం నాయకుడు ఎదురుతిరగడంతో పరారయ్యారు. దాడి యత్నాన్ని ఆనం వెంకటరమణారెడ్డి తీవ్రంగా ఖండించారు. పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేసినా నామమాత్రంగా స్పందించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Published : 04 Jun 2023 21:04 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు