Viral Video: రాంగ్‌ సైడ్‌లో డ్రైవింగ్‌.. ఆటో డ్రైవర్ హల్‌చల్‌

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ (Amritsar)లో ఓ ఆటో డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో పదుల సంఖ్యలో ప్రమాదాలకు కారణమయ్యాడు. ట్రాఫిక్ సిగ్నల్స్ పట్టించుకోకుండా.. రాంగ్‌ సైడ్‌లో ఇష్టం వచ్చినట్లు వాహనాన్ని నడిపాడు. కొందరు స్థానికులు అతడిని కర్రలతో భయపెట్టి... ఆటో ఆపే యత్నం చేశారు. పోలీసులు వెంబడించడంతో ఆటోను అక్కడే రోడ్డుపై వదిలి.. నిందితుడు పరారయ్యాడు. పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

Updated : 31 Jan 2023 21:14 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు