RRR: 150 టెస్లా కార్లతో ‘నాటు నాటు’.. ప్రవాసాంధ్రుల అద్భుత ప్రదర్శన

‘ఆర్‌ఆర్ఆర్‌’ (RRR) నుంచి ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ దక్కడంతో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు ప్రజలు సంతోషంలో మునిగిపోయారు. పలువురు తమ అభిమానాన్ని వివిధ రూపాల్లో ప్రదర్శిస్తున్నారు. తాజాగా అమెరికాలోని న్యూజెర్సీలో 150 టెస్లా కార్లతో చేసిన ప్రదర్శన సినీ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. టెస్లా కార్లను RRR ఆకృతిలో నిలిపి.. కళ్లు మిరిమిట్లుగొలిపే రీతిలో లైటింగ్‌తో ఆ సినిమా పాటల బాణీలకు తగినట్టు అద్భుతంగా ప్రదర్శించారు. దానికి సంబంధించిన వీడియోను చిత్ర దర్శకుడు రాజమౌళి తన ట్విటర్ ఖాతాలో షేర్‌ చేశారు.

Updated : 21 Mar 2023 21:38 IST

మరిన్ని