AP News: తెదేపా నేత అయ్యన్నకు ఊరట.. రిమాండ్‌కు తిరస్కరణ

తెదేపా నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి న్యాయస్థానంలో ఊరట లభించింది. ఇవాళ తెల్లవారుజామున అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు రాజేశ్‌ను అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపర్చారు. నిబంధనలకు విరుద్ధంగా అయ్యన్నను అరెస్టు చేశారని ఆయన తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి... అయ్యన్న రిమాండ్‌ను తిరస్కరించారు. ఈకేసులో 467 సెక్షన్‌ వర్తించదని స్పష్టం చేసిన న్యాయస్థానం.. 41ఏ నోటీసు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోవచ్చని ఆదేశించింది.

Updated : 03 Nov 2022 18:45 IST

మరిన్ని