Andhra News: దుస్తులు కూడా మార్చుకోనివ్వకుండా లాక్కెళ్లారు: అయ్యన్న సతీమణి

తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నర్సీపట్నంలో గురువారం వేకువ జామున భారీ ఎత్తున పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. అనంతరం నోటీసులు అందజేసి అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి పద్మావతి స్పందించారు. కనీసం దుస్తులు మార్చుకొనివ్వకుండా, కాళ్లకు చెప్పులు కూడా వేసుకునివ్వకుండా తన భర్తను తోసుకుంటూ పోలీసులు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా తమ కుటుంబాన్ని పలు విధాలుగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. 

Published : 03 Nov 2022 07:24 IST

Tags :

మరిన్ని