అందరి సమస్యలు తెలుసుకొని.. మమ్మల్ని పట్టించుకోరా?:వైకాపా ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు

కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే సుధకు నిరసన సెగ తగిలింది. ఒకటో వార్డులో ఎమ్మెల్యే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. మిద్దెలవారిపాలెంలో మహిళలు తమ వార్డులో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. అన్ని వార్డుల్లో సిమెంట్ రోడ్లు వేసి.. తమ వార్డులో ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. కోటవీధిలో గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించి మిద్దెల వారి పాలెంలో నిర్వహించకుండా వెళ్లిపోవడం తగదన్నారు. 

Updated : 26 Nov 2022 16:52 IST

మరిన్ని