Balagam: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ‘బలగం’ మెుగిలయ్య

‘బలగం’ (Balagam) సినిమాలోని క్లైమాక్స్ పాట.. కుటుంబ సంబంధాల్లో అడుగంటిపోతున్న ప్రేమానురాగాల్ని సున్నితంగా తట్టిలేపింది. తోబుట్టువుల మధ్య ముళ్లకంచెలా మారిన అహాన్ని పటాపంచెలు చేసింది. అనుబంధాల గాఢతను హృదయానికి తాకేలా కొమురమ్మ, పస్తం మొగిలయ్య(Mogulaiah) ఆ పాటను ఆలపించారు. భావోద్వేగాలను తన గొంతులో పలికించిన గాయకుడు మొగిలయ్య జీవితం.. ఇప్పుడు విషాద భరితంగా మారిపోయింది. రెండు కిడ్నీలు పాడవ్వడంతో ఆపన్నహస్తం కోసం ఏదురుచూస్తున్నారు.

Updated : 01 Apr 2023 14:56 IST

Tags :

మరిన్ని