NTR: ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన బాలకృష్ణ

నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం తెనాలి పెమ్మసాని థియేటర్‌లో జరిగిన వేడుకల్లో బాలకృష్ణ పాల్గొన్నారు. ఎన్టీఆర్‌కు ఘన నివాళి అర్పించారు. 365 రోజులపాటు రోజుకొక ఎన్టీఆర్‌ చిత్రం ఉచిత షో ప్రదర్శన చేయనున్నారని, నెలకొకసారి సినీ కార్మికులకు అవార్డులు అందచేయనున్నట్లు బాలయ్య తెలిపారు. అభిమానుల్ని ఉద్దేశిస్తూ..‘‘అందరూ ఆత్మ విమర్శ చేసుకోండి. ఒక్క ఛాన్స్‌ అంటే ఒక్క తప్పిదం చేశారు. ఓటు వేశారు.. అనుభవిస్తున్నారు. ఇకనైనా ఆత్మ విమర్శ చేసుకోండి అని బాలయ్య అన్నారు.

Published : 28 May 2022 13:18 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని