Balakrishna: అది నాకు పండగలా ఉంటుంది: బాలకృష్ణ

మన ఆలోచనలకు మన శరీరాన్ని బానిసగా చేసుకుంటే.. వయసుతో సంబంధం లేకుండా సమాజానికి సేవ చేయొచ్చని నందమూరి బాలకృష్ణ (Balakrishna) అన్నారు. హైదరాబాద్‌లోని బసవ తారకం ఆస్పత్రిలో బాలకృష్ణ జన్మదిన వేడుకల్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ కేక్ కోశారు. చిన్నారులకు కానుకల్ని పంపిణీ చేశారు. బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి ఛైర్మన్‌గా ఉండటం.. తన పూర్వజన్మ సుకృతమని చెప్పారు. ఆస్పత్రి నుంచి ఒక రోగి డిశ్చార్జ్ అయ్యి వెళ్తుంటే.. తనకు పండగలా ఉంటుందని వ్యాఖ్యానించారు.

Updated : 10 Jun 2023 16:30 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు