Alai Balai- LIVE: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ‘అలయ్ బలయ్’.. హాజరైన ప్రముఖులు

హైదరాబాద్: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ‘అలయ్ బలయ్’ కార్యక్రమం జరుగుతోంది. దసరా సమ్మేళనం- 2022లో భాగంగా హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా జరగుతున్న అలయ్ బలయ్‌కు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, ప్రముఖ సినీనటుడు చిరంజీవి, మాజీ ఎంపీ వీహెచ్‌ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులకు విజయలక్ష్మి స్వాగతం పలికారు.

Published : 06 Oct 2022 12:08 IST

మరిన్ని

ap-districts
ts-districts