Sanjay - Kavitha: బండి సంజయ్‌, ఎమ్మెల్సీ కవిత ఆత్మీయ పలకరింపులు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay Kumar), భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (K. Kavitha) ఆత్మీయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. నిజామాబాద్‌లో భాజపా నేత బస్వ నర్సయ్య నూతన గృహ ప్రవేశం కార్యక్రమానికి సంజయ్‌ హాజరయ్యారు. అదే కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత సైతం రాగా, ఇద్దరు పరస్పరం ఎదురై నమస్కారం చేసుకున్నారు.ఈ సందర్భంగా అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా, జిల్లా జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌ రావును సంజయ్‌కు.. కవిత పరిచయం చేశారు.  

Updated : 31 May 2023 16:56 IST

మరిన్ని