Viral Video: డిస్కౌంట్‌ సేల్‌.. చీర కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహిళలకు చీరలంటే మహా ఇష్టం. అదీ.. డిస్కౌంట్‌లో వస్తున్నాయంటే.. ఎక్కడున్నా సరే ఆ షాపులో వాలిపోవాల్సిందే. బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో ఉండే మైసూరు సిల్క్‌ శారీ సెంటర్‌ కూడా ఇటీవల డిస్కౌంట్‌ ధరలతో ఇయర్లీ శారీ సేల్‌ నిర్వహించింది. దీంతో చీరలు కొనుగోలు చేసేందుకు మహిళలు ఆ దుకాణానికి పోటెత్తారు. అందులో ఇద్దరు మహిళలకు ఒకే చీర నచ్చింది. ఇంకేముంది.. ‘నాక్కావాలంటే.. నాకే కావాలంటూ’ ఇద్దరూ గొడవకు దిగారు. అది కాస్తా ముదిరి జుట్టు పట్టుకుని కొట్టుకునేవరకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్‌మీడియాలో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

Updated : 24 Apr 2023 11:33 IST
Tags :

మరిన్ని