Toys: మీ పిల్లలకు ఆటబొమ్మలను కొంటున్నారా.. ఐతే జాగ్రత్త..!

మీ చిన్నారులకు ఆటబొమ్మలను కొంటున్నారా...? ఐతే, కాస్త జాగ్రత్త ఐఎస్ఐ మార్క్ ఉందో లేదో సరిచూసుకోండి. ఇవి ఆషామాషీ మాటలు కాదు. అధికారుల హెచ్చరికలు. ముఖ్యంగా చైనా నుంచి దిగుమతవుతున్న బొమ్మలతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చిన్నప్పుడు పిల్లలు అతిగా మారాం చేస్తే బొమ్మలు కొనిస్తారు. కానీ, బొమ్మల మాటున దాగున్న ప్రమాదాన్ని మాత్రం పసిగట్ట లేకపోతున్నారు. నాణ్యత లేని బొమ్మలు మార్కెట్లో కుప్పలు తెప్పలుగా లభిస్తున్నాయి. వీటితో చిన్నారుల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వీధికొక కంపెనీ పుట్టుకొచ్చి నాణ్యతలేని బొమ్మలను తయారు చేస్తూ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. 

Updated : 03 Feb 2023 12:43 IST

మరిన్ని