Bhediya: ‘భేదియా’ నుంచి ‘చిలిపి వరాలే ఇవ్వు..’ పాట విడుదల

వరుణ్ ధావన్, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో అమర్‌ కౌశిక్‌ తెరకెక్కించిన హారర్‌ కామెడీ చిత్రం ‘భేదియా’. నవంబర్‌ 25న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘తుమ్కేశ్వరి’ పాటకు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలోనే చిత్రంలోని రెండో పాటను ‘చిలిపి వరాలే ఇవ్వు..’ను అధికారికంగా లాంచ్‌ చేసింది చిత్ర బృందం. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా ‘భేదియా’ను తెలుగులో విడుదల చేస్తున్నారు.

Published : 07 Nov 2022 16:54 IST
Tags :

మరిన్ని