Visakhapatnam: గాజువాకలో ఒక అడుగు మేర ఒరిగిన భారీ గణనాథుడు..!

విశాఖలోని గాజువాకలో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన 89 అడుగుల భారీ వినాయక మట్టి విగ్రహం ఒక అడుగు మేర పక్కకు ఒరిగిపోయింది. దీంతో విగ్రహం ఎక్కడ కింద పడిపోతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే మండపానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. తనిఖీ చేసిన ఆర్‌ అండ్‌ బీ అధికారులు ప్రమాదానికి అవకాశాలు ఉన్నాయని పోలీసులకు తెలిపారు. ఏ క్షణమైనా ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో విగ్రహానికి 100 మీటర్లలోపు ఎవరినీ పోలీసులు అనుమతించడం లేదు.

Published : 10 Sep 2022 14:57 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు