అర్ధరాత్రి ప్రేయసి ఇంటికి.. బావిలో పడి అడ్డంగా బుక్కయ్యాడు..!

బిహార్‌లో ప్రేయసిని కలిసేందుకు అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లిన ఓ వ్యక్తి.. యువతి కుటుంబ సభ్యులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఛాప్రా జిల్లా గడ్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతీరాజ్ పుర్‌లో ఉండే మున్నా రాజ్ అనే వ్యక్తి... శనివారం అర్ధరాత్రి తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. రాత్రివేళ శబ్దాలు రావడాన్ని గమనించిన యువతి కుటుంబసభ్యులు లేచి చూశారు. ఇంట్లోకి వచ్చిన మున్నా రాజ్‌ను తరిమేందుకు ప్రయత్నించారు. దీంతో తనను తాను కాపాడుకునేందుకు దగ్గర్లోని బావిలోకి మున్నా దూకేశాడు. అనంతరం ఈ ఘటనపై పంచాయతీ పెట్టారు. గ్రామ పెద్దలు యువతి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారిని ఒప్పించి మున్నా రాజ్‌కు యువతినిచ్చి స్థానిక ఆలయంలో వివాహం జరిపించారు.

Published : 12 Dec 2022 12:57 IST

Tags :

మరిన్ని