BJP: భాజపాను ప్రపంచంలోనే అతిముఖ్యమైన పార్టీగా అభివర్ణించిన వాల్‌స్ట్రీట్

అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం.. భారతీయ జనతా పార్టీని ప్రపంచంలో అతి ముఖ్యమైన పార్టీగా అభివర్ణించింది. 18 కోట్ల కార్యకర్తలతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఉన్న భాజపా అమెరికా జాతీయ ప్రయోజనాల కోణంలో అతి ముఖ్యమైన విదేశీ పార్టీగా పేర్కొంది. భారత్ అగ్రగామి ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని కొనియాడింది. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ఆగడాలకు.. కళ్లెం వేసేందుకు అమెరికా వ్యూహ రచనలో భారత్ ముఖ్య పాత్ర పోషిస్తోందని వివరించింది.  

Published : 21 Mar 2023 18:04 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు