TS News: సిద్దిపేట జిల్లాలో ప్రోటోకాల్ వివాదం.. ఎమ్మెల్యే రఘునందన్‌ ఆగ్రహం

సిద్దిపేట జిల్లాలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. మిరుదొడ్డి మండలంలోని అక్బర్‌పేట్‌లో డీసీసీబీ బ్యాంకు ప్రారంభోత్సవ ఫ్లెక్సీ ఏర్పాటు చేయకపోవడంపై ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనకు.. స్థానిక మంత్రి, అధికార పార్టీ నాయకులు ప్రాధాన్యం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఈ మేరకు అధికారుల తీరును నిరసిస్తూ పలు మండలాల్లో జరుగుతున్న కార్యక్రమాలను ఎమ్మెల్యే రఘునందన్ బహిష్కరించారు. 

Published : 07 Oct 2022 19:19 IST

మరిన్ని

ap-districts
ts-districts