Telangana News: కుటుంబ, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా భాజపా తీర్మానం

హైదరాబాద్ H.I.C.C. వేదికగా భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా పదాధికారుల సమావేశాన్ని  ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు. ఉదయం 10 గంటల సమయానికి ఆరంభమైన పధాధికారుల సమావేశంలో కార్యవర్గ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై అజెండాను ఖరారు చేయనున్నారు. ఈ సమావేశానికి ఏపీ తెలంగాణా  రాష్ట్రాల నుంచి 8 మంది సహా మొత్తం 128 మంది పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. 2024 ఎన్నికల్లో తెలంగాణాతో  పాటు వివిధ రాష్ట్రాల్లో భాజపాను అధికారంలోకి తీసుకురావడం, ప్రధాని మోదీ ఎనిమిదేళ్ల  పాలన, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై అజెండా సిద్ధం కానుంది. 

Published : 02 Jul 2022 15:22 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని