Ukraine: భారీ డ్యామ్‌ పేల్చివేత.. ఉక్రెయిన్‌లో జలవిపత్తు!

దక్షిణ ఉక్రెయిన్‌లోని పెద్ద ఆనకట్ట పేలిపోయింది. భారీగా నీరు పోతోంది. ఇందుకు కారణం మీరంటేమీరని రష్యా, ఉక్రెయిన్.. పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఆనకట్ట నుంచి పోటెత్తుతున్న వరదతో.. పది గ్రామాలు, ఖేర్సన్ నగరానికి ముప్పు పొంచి ఉంది. క్రిమియా సహా అనేక ప్రాంతాలకు తాగునీటి కొరత ఏర్పడే అవకాశముంది. జపొరిజియా అణువిద్యుత్ కేంద్రానికి సరఫరా నిలిచిపోతుందనే ఆందోళన కలవరపెడుతోంది. 

Published : 06 Jun 2023 14:50 IST

మరిన్ని