Eluru: చొక్కా అడిగితే అమ్మ ఇవ్వలేదు సార్‌!.. పోలీసులకు బాలుడి ఫిర్యాదు

ఓపక్క స్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు హాజరుకావాలి.. తెల్ల చొక్కా అగిడితే అమ్మ ఇవ్వనంటోంది.. ఇప్పుడు ఏం చేయాలి? అనుకుంటూ ఓ పదేళ్ల బుడతడు మదన పడ్డాడు. స్నానం చేసి కట్టుకున్న టవల్‌తోనే చొక్కా లేకుండా నేరుగా పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. ఏలూరు (Eluru) నగరంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. సాయిదినేష్‌ (10) తల్లి రెండేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందగా తండ్రి మరో పెళ్లి చేసుకున్నారు. స్నేహితుడి పుట్టినరోజుకు వెళ్లాలని ఆదివారం సాయిదినేష్‌ స్నానం చేసి మారు తల్లిని తెల్ల చొక్కా ఇవ్వమన్నాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో దినేష్‌ చొక్కా వేసుకోకుండానే టూటౌన్‌ పోలీసుస్టేషన్‌కు వచ్చి మారుతల్లిపై ఫిర్యాదు చేశాడు. 

Published : 15 May 2023 15:02 IST

Tags :

మరిన్ని