Brahmaji: కృష్ణ వంశీ మా పెళ్లికి కన్యాదానం చేశారు: బ్రహ్మాజీ దంపతులు

తమ ప్రేమ పెళ్లికి దర్శకుడు కృష్ణ వంశీ కన్యాదానం చేసినట్లు బ్రహ్మాజీ - సాశ్వతి (Brahmaji - Sashwathy) దంపతులు తెలిపారు. ‘ఈటీవీ’లో ప్రతి మంగళవారం ప్రసారమయ్యే ‘అలా మొదలైంది (Ala Modalaindi)’ కార్యక్రమానికి ఈ జంట విచ్చేసి సందడి చేసింది. తాను ప్రేమలో ఉన్నప్పుడు పబ్లిక్ బూత్‌ల వద్దే సమయమంతా గడిపే వాడినని.. సాశ్వతి పుట్టినరోజు కోసం చైన్‌ కూడా తాకట్టు పెట్టిన్నట్లు బ్రహ్మాజీ చెప్పారు. మే 2న ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. కాగా, బ్రహ్మాజీ బెంగాలీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 

Published : 27 Apr 2023 17:57 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు