America: మాంటేరి పార్క్‌లో హంతకుడిని ధైర్యంగా అడ్డుకున్న యువకుడు

అమెరికాలో 72 ఏళ్ల ఆ నిందితుడు.. అప్పటికే ఆటోమేటిక్ గన్‌తో విచక్షణా రహితంగా దాడికి పాల్పడి 11 మంది అమాయకులను పొట్టన బెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా మరో ప్రాంతంలోనూ మారణహోమం సృష్టించేందుకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తి చేతిలో గన్‌ను చూసి అందరూ పారిపోతున్నా.. ఓ యువకుడు మాత్రం సాహసం చేశాడు. ధైర్యంగా వృద్ధుడి చేతిలోని తుపాకీ లాక్కొని.. అతడికే గురిపెట్టాడు. ఈ ప్రతిఘటనతో భయపడిన ఆ నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఇప్పుడు ఆ యువకుడిని రియల్ హీరో అని ప్రపంచం పొగడ్తలతో ముంచెత్తుతోంది.

Updated : 25 Jan 2023 20:33 IST

Tags :

మరిన్ని