Viral Video: వధువును తీసుకెళ్లేందుకు హెలికాప్టర్‌లో వచ్చిన వరుడు

వధువును తీసుకెళ్లేందుకు వరుడు వినూత్నంగా హెలికాప్టర్‌లో వెళ్లి ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటన రాజస్థాన్ కోటా జిల్లాలో జరిగింది. తాతయ్య, నానమ్మలతో కలిసి పెళ్లికూతురి గ్రామానికి హెలికాప్టర్‌లో వెళ్లిన వరుడు.. వధువును అందులో ఎక్కించుకుని ఏడు రౌండ్లు తిరిగాడు. అన్ని కార్యక్రమాలు ముగిసిన అనంతరం తిరిగి వధువుతో సొంతూరికి బయలుదేరాడు. హెలికాప్టర్‌లో వచ్చిన కొత్త జంటను చూసేందుకు జనం పోటీ పడ్డారు.

Published : 29 Jan 2023 16:08 IST
Tags :

మరిన్ని