BRS: వనపర్తి జిల్లాలో భారాసకు భారీ ఎదురుదెబ్బ..!

వనపర్తి జిల్లాలో అధికార భారాసకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా పరిషత్ ఛైర్మన్ సహా మరికొందరు కీలక నేతలు పార్టీని వీడనున్నట్లు ప్రకటించారు. జడ్పీ ఛైర్మన్ లోకనాథ్ రెడ్డి, వనపర్తి, పెద్దమందడి ఎంపీపీలు కిచ్చారెడ్డి, మెగారెడ్డి భారాసకు రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. సొంత పార్టీలో ఉంటూనే అవమానాలు పడుతున్నామని చెప్పారు. కేవలం ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్నాం తప్పితే తమ పదవులకు సంబంధించిన కార్యక్రమాలలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న స్వతంత్రం లేకుండా ఉందని వారు వాపోయారు. 

Published : 09 Mar 2023 15:47 IST
Tags :

మరిన్ని