మంత్రి, కలెక్టర్ చూస్తుండగానే ఎంపీటీసీ సభ్యురాలిని ఈడ్చుకెళ్లిన భారాస నేతలు!

మంత్రి, కలెక్టర్ చూస్తుండగానే ఎంపీటీసీ సభ్యురాలిని భారాస (BRS) నేతలు ఈడ్చుకెళ్లిన ఘటన మేడ్చల్ కలెక్టరేట్‌లో చోటుచేసుకుంది. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై షామీర్‌పేటలోని కలెక్టరేట్‌లో మంత్రి మల్లారెడ్డి (Mallareddy) అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో అవుషాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు శోభ.. రైతుల సమస్యల గురించి మాట్లాడటంతో భారాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై దాడి చేసి బయటకు ఈడ్చుకెళ్లినట్టు భాజపా నేతలు తెలిపారు. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ చోద్యం చూస్తూ ఉండిపోయారని వారు వాపోయారు. 

Updated : 27 May 2023 19:41 IST

మంత్రి, కలెక్టర్ చూస్తుండగానే ఎంపీటీసీ సభ్యురాలిని ఈడ్చుకెళ్లిన భారాస నేతలు!

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు