Suryapet: భారాస సభలో పోలీసుల అత్యుత్సాహం.. జనం బయటకు వెళ్లకుండా గేట్లు!

సూర్యాపేట (Suryapet) జిల్లా కోదాడలో భారాస (BRS) ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన ప్రజలను బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డగించారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ (Bollam Mallaiah Yadav) ఏర్పాటు చేసిన ఈ సభకు వచ్చిన ప్రజల్లో.. కొందరు మధ్యలోనే బయటకు వెళ్లాలని భావించారు. ఐతే, వారిని బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డగించారు. ఎవరూ వెళ్లకుండా గేట్లు వేయడంతో.. ప్రజలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన జనం ఒక్కసారిగా గేట్లను తీసుకొని బయటపడ్డారు. మరికొందరు గోడదూకి బయటకి వెళ్లిపోయారు. సభలో ప్రజలపై పోలీసులు ప్రవర్తించిన తీరు పలు ప్రశ్నలకి దారితీస్తోంది.

Published : 16 Apr 2023 21:05 IST
Tags :

మరిన్ని