Bus Fire: ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి ఆర్టీసీ బస్సు దగ్ధం.. ఒకరు మృతి!

సూర్యాపేట(Suryapet) మునగాల మండలం ఇందిరానగర్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. హైదరాబాద్ మియపూర్‌కు చెందిన రాజధాని ఆర్టీసీ(ఞథహఞఢ) బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తుండగా అకస్మాత్తుగా వచ్చిన స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బస్సు కిందకు స్కూటీ వెళ్లడంతో మంటలు వ్యాప్తి చెంది బస్సుకు అంటుకున్నాయి. క్షణాల్లో రెండు వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. గాయాలపాలైన ద్విచక్రవాహనదారుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

Updated : 30 Mar 2023 11:23 IST

Bus Fire: ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి ఆర్టీసీ బస్సు దగ్ధం.. ఒకరు మృతి!

మరిన్ని